మావోయిస్ట్ కీలక నేత వంతల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ గొడ్డలి రాయుడు ను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో 60మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. మావోల లొంగుబాటుపై డీఐజీ హరికృష్ణ, జిల్లా ఎస్పీ సతీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అందించారు.